మైనర్ బాలిక కిడ్నాప్ కేసులో నిందితులు అరెస్ట్
కృష్ణా: తరకటూరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మైనర్ బాలికను కిడ్నాప్ చేసి బలవంతంగా తీసుకెళ్లారని బాలిక తల్లిదండ్రులు గూడూరు పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యల్లో భాగంగా మైనర్ బాలిక గుడివాడలో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి బాలికను సురక్షితంగా గుర్తించి, నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.