రైలులో బ్యాగు చోరీపై జీరో ఎఫ్ఎఆర్

రైలులో బ్యాగు చోరీపై జీరో ఎఫ్ఎఆర్

HYD: రైలులో ప్రయాణికుడి బ్యాగు చోరీపై కాచిగూడ రైల్వే పోలీసులు జీరో ఎఫ్ఎఆర్ నమోదు చేశారు. రైల్వే ఇన్‌స్పెక్టర్ ఆర్.ఎల్లప్ప తెలిపిన వివరాల ప్రకారం.. పెబ్బేరుకి చెందిన సురేశ్ పురి(37) కాచిగూడకు రావడానికి రాజస్థాన్‌లోని ఓ స్టేషన్‌లో రైలు ఎక్కాడు. రైలు నాందేడ్ వద్దకు రాగానే బ్యాగు కనిపించలేదన్నాడు. బ్యాగులో 10 గ్రాముల 2 బంగారు ఉంగరాలు, బట్టలు, ఆధార్ కార్డు ఉందన్నారు.