VIDEO: 'రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'
MDK: రోడ్డు ప్రమాదాల వల్ల దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని తూప్రాన్ DSP నరేందర్ గౌడ్ తెలిపారు. మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన పంచాయతీ పాలకవర్గ శిక్షణ కార్యక్రమానికి నిన్న ఆయన హాజరయ్యారు. 'అరైవ్-అలైవ్' కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై సర్పంచ్లు, వార్డు సభ్యులకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.