గ్రంథాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా కార్యదర్శి

గ్రంథాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా కార్యదర్శి

VZM: గంట్యాడ మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయాన్ని సోమవారం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి.లక్ష్మి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను నిశితంగా పరిశీలించారు. గ్రంథాలయానికి వచ్చే రోజువారి పాఠకుల సంఖ్య వివరాలు గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న పుస్తకాల గురించి అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు.