మహానంది క్షేత్రంలో భక్తుల మహా ప్రదక్షిణ

మహానంది క్షేత్రంలో భక్తుల మహా ప్రదక్షిణ

NDL: మహానంది క్షేత్రంలో సోమవారం సందర్భంగా హిందూ సంస్థల ప్రతినిధులు, భక్తులు మహా ప్రదక్షిణ కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తులందరూ ఓం నమఃశివాయ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ భక్తి పారవశ్యంతో ప్రదక్షిణలు చేశారు. ఆలయం ముఖ మండపం వద్ద భక్తి గీతాలు, నగర సంకీర్తనలు ఆలపించారు.శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.