అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

MHBD: నర్సింహులపేట మండల కేంద్రంలో మంగళవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మీసేవా కేంద్రం నిర్వాహకుడు సాగర్ (35) అనే వ్యక్తి ఉరివేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.