నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
PDPL: ఓదెల మండలం పొత్కపల్లి సబ్‌స్టేషన్ పరిధిలో ఇవాళ అత్యవసర మరమ్మతు పనులు చేపట్టనున్నందున విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అదనపు సహాయ ఇంజినీర్ ఆర్. చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.