పంటలను ధ్వంసం చేసిన ఏనుగుల మంద
CTR: పులిచెర్ల మండలం ఎల్లంకివారిపల్లిలో బుధవారం తెల్లవారుజామున ఏనుగుల మంద హల్‌చల్ చేసింది. భీమవరం అడవి నుంచి వచ్చిన గజరాజులు మామిడి, కొబ్బరి, వరి పంటలను తొక్కి ధ్వంసం చేయడంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. బీభత్సం అనంతరం ఏనుగులు తిరిగి అడవిలోకి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. పంట నష్టాన్ని చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.