విజయవాడలో 13 మందిపై కేసు నమోదు: సీఐ
NTR: విజయవాడ శివారులోని పి. నైనవరం గ్రామంలో శనివారం సాయంత్రం పోలీసులు కోడిపందాల శిబిరంపై మెరుపు దాడి చేశారు. కొత్తపేట సీఐ కొండలరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దాడిలో 13 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.5,600 నగదు, రెండు కోడి కత్తులు స్వాధీనం చేసుకుని, నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.