ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం
JN: గ్రామ పంచాయతీ ఎన్నికలలో విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. మండలాల వారీగా MPDO కార్యాలయాల్లో ప్రత్యేక ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి డిసెంబర్ 9,12,15 తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు.