నర్రవాడలో గాలికుంటు టీకాల కార్యక్రమం

నర్రవాడలో గాలికుంటు టీకాల కార్యక్రమం

NLR: దుత్తలూరు మండలం నర్రవాడ మజార గుడివారిపాలెంలో పశుసంవర్ధక శాఖ ఇన్‌ఛార్జ్ వైద్యుడు మధు ఆధ్వర్యంలో ఇవాళ ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రమాదకర వ్యాధి నుంచి రక్షించేందుకు రైతులు పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలన్నారు. ఈ మేరకు ఆయన ఈ వ్యాధి నివారణకు సంబంధించిన అవగాహన గోడపత్రాలను ఆవిష్కరించారు.