శీతకాల సమావేశాల్లో చర్చించనున్న అరకు ఎంపీ
ASR: సోమవారం నుంచి పార్లమెంటు శీతకాల సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల్లో అరకు ఎంపీ తనూజారాణి పాల్గొననున్నారు. మొంథా తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారంపై సమావేశాల్లో చర్చించనున్నట్లు ఎంపీ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం తదితర అంశాలపై ప్రస్తావించడం జరుగుతుందన్నారు.