నేడు విద్యాసంస్థలకు సెలవు

MDK: మెదక్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు హవేళిఘన్‌పూర్, రామాయంపేట, నిజాంపేట మండలాల్లోని మొత్తం విద్యా సంస్థలకు ఇవాళ సెలవు ప్రకటించారని డీఈవో రాధా కిషన్ తెలిపారు. ఈ విషయన్ని మండలాల ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు గమనించాలని కోరారు.