VIDEO: చెరువును తలపిస్తున్న దేవీపట్నం కాలనీ
E.G: గోకవరం మండలంలో పోలవరం నిర్వాసులకు నిర్మించిన పునరావాస కాలనీ తుపాను కారణంగా గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగి చెరువును తలపిస్తుంది. దానికి తోడు కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి బురదమయంగా మారడంతో కాలనీవాసులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు సరైన రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.