బాధిత కుటుంబానికి బియ్యం వితరణ

NLG: చిట్యాల మండలంలోని వట్టిమర్తి గ్రామానికి చెందిన సిరిపంగి ఎట్టయ్య ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడి హరికృష్ణ బాధిత కుటుంబాన్ని శనివారం పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం 50 కిలోల బియ్యాన్ని కుటుంబానికి అందించి ధైర్యం చెప్పారు.