బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం హెల్ప్‌లైన్ ఏర్పాటు
పశ్చిమాసియా సంక్షోభ బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. 1800118797, +911123012113, +911123014104, +91112301 7905 నంబర్లను సంప్రదించాలని సూచించింది. వీటితోపాటు ఇజ్రాయెల్, జోర్డాన్, ఇరాన్, లెబనాన్, బహ్రెయిన్, ఇరాక్, కువైట్, ఖతార్, ఒమన్, పాలస్తీనా, సౌదీ అరేబియా, రమల్లా, యూఏఈల్లో చిక్కుకున్నవారి కోసం దేశాల వారీగా నంబర్లను సిద్ధం చేసింది.