శ్యాం ప్రసాద్ ముఖర్జీ సేవలు చిరస్మరణీయం

శ్యాం ప్రసాద్ ముఖర్జీ సేవలు చిరస్మరణీయం

NRML: భైంసాలో ఆదివారం జనసంఘ్‌ వ్యవస్థాపకులు డా.శ్యాంప్రసాద్‌ ముఖర్జీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ భైంసా టౌన్ అధ్యక్షుడు రాము, ముథోల్ అసెంబ్లీ కన్వీనర్ సాయినాథ్, బీజేపీ నేతలు పాల్గొన్నారు.