రామాలయం నిర్మాణానికి నిధులు మంజూరు
AKP: బోడపాలెం శివారు కొత్తూరు గ్రామంలో రామాలయం నిర్మాణానికి రూ.40 లక్షలు మంజూరయ్యాయి. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత నిధులు మంజూరు పత్రాన్ని మండల టీడీపీ అధ్యక్షుడు లింగన్నాయుడు, స్థానిక పీఏసీఎస్ డైరెక్టర్ సత్యనారాయణకు అందజేశారు. నిధులు మంజూరు చేయించిన హోంమంత్రికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు.