నీరుకొండ పరిసర ప్రాంతాలు పరిశీలించిన మంత్రి

GNTR: కొండవీటి వాగు ప్రవావాహానికి ఆటంకం వల్ల నీరు నిలిచిపోయిన నీరుకొండ పరిసర ప్రాంతాలతను మంత్రి నారాయణ మంగళవారం నాడు పరిశీలించారు. పశ్చిమ బైపాస్ రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణంతో కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అడ్డుగా ఉన్న మట్టిని తొలగించడంతో పాటు వెస్ట్ బైపాస్ రోడ్డుకు రెండు చోట్ల గండ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.