'అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తాం'

NRPT: నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. శుక్రవారం దామరగిద్ద మండల కేంద్రంలో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.