వైసీపీ కోటి సంతకాల ఉద్యమం ప్రారంభం
NDL: నంద్యాల పట్టణంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు గాంధీ చౌక్ సెంటర్‌లో వైసీపీ కోటి సంతకాల ఉద్యమాన్ని ఇవాళ ప్రారంభించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తుండడంతో దానికి నిరసనగా YCP పార్టీ కోటి సంతకాల ఉద్యమాన్ని చేపట్టారు. ఈ ఉద్యమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సంతకాలు చేశారు.