ఆర్టీసీ బస్సు- టిప్పర్ ఢీ.. ఇద్దరికి గాయాలు

ఆర్టీసీ బస్సు- టిప్పర్ ఢీ.. ఇద్దరికి గాయాలు

VKB: కోటిపల్లి నుంచి వికారాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని లక్ష్మీనగరు తండా వద్ద టిప్పర్ ఢీ కొట్టింది. దీంతో బస్సులోని ఇద్దరికి గాయాలయ్యాయి. కాగా, కోటిపల్లి నుంచి వికారాబాద్ వచ్చే బస్సును వేగంగా వచ్చిన టిప్పర్ ఢీ కొట్టడంతో ఆర్టీసీ బస్సు స్వల్పంగా దెబ్బతింది. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.