అధిక ధరకు మద్యం అమ్మితే కేసులు: అబ్కారీ సీఐ

అధిక ధరకు మద్యం అమ్మితే కేసులు: అబ్కారీ సీఐ

ASR: జీకేవీధిలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో శనివారం అబ్కారీ సీఐ కూర్మారావు తనిఖీలు నిర్వహించారు. అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో నిల్వలు, ధరలను పరిశీలించారు. ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని ఆయన సిబ్బందిని హెచ్చరించారు.