'స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి'
యాదాద్రి: స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. పదేళ్లలో జరిగిన అభివృద్ధి గురించి గ్రామాల్లో ప్రజలకు వివరించాలని సూచించారు. రామన్నపేట లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో మంగళవారం ఆయన స్థానిక సంస్థల ఎన్నికలపై సన్నాహక సమావేశం నిర్వహించారు. గత అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు.