మధిరలో రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు
KMM: మధిరలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ.. స్థానిక నాయకత్వంతోనే మధిర అభివృద్ధి సాధ్యమన్నారు. సుమారు రూ. 600 కోట్లతో పట్టణ అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు. భావితరాల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు, సదుపాయాల కల్పన జరుగుతోందన్నారు.