VIDEO: సూర్యాపేట హాస్టల్‌లో భద్రతా వైఫల్యం

VIDEO: సూర్యాపేట హాస్టల్‌లో భద్రతా వైఫల్యం

సూర్యాపేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో కలకలం రేగింది. ఇద్దరు బాలికలు అర్ధరాత్రి దాటాక గేటు దాటి బయటకు వెళ్లి, తెల్లవారుజామున తిరిగి వచ్చిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. వందలాది మంది విద్యార్థినులున్న వసతి గృహంలో వార్డెన్, వాచ్‌మెన్ నిఘా ఏమైందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.