జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా ఆర్మూర్ చిన్న బాల్ రాజ్
NZB: జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా ధర్పల్లి మండలానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ఆర్మూర్ చిన్న బాల్ రాజ్‌ను పార్టీ నియమించింది. గత పది సంవత్సరాలుగా మండల అధ్యక్షులుగా పనిచేసిన ఆయనకు ఈ పదవిని కట్టబెట్టారు. ఈ సందర్భంగా చిన్న బాల్ రాజ్ మాట్లాడుతూ.. పార్టీ తనను నమ్మి ఈ పదవిని ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానని చెప్పుకొచ్చారు.