'లోక్ అదాలత్‌లో సమస్యలు పరిష్కరించుకోవాలి'

'లోక్ అదాలత్‌లో సమస్యలు పరిష్కరించుకోవాలి'

MBNR: ఈనెల 13న జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్‌ను వినియోగించుకుని వివాదాలను త్వరగా పరిష్కరించాలని ఎస్పీ జానకి న్యాయవాదులకు విజ్ఞప్తి చేశారు. క్రిమినల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి విభజన, బ్యాంకు రికవరీ, విద్యుత్, దొంగతనం, చెక్‌బౌన్స్ లాంటి కేసులను పరస్పర పరిష్కారం ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆమె తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె అన్నారు.