ఉండవల్లి నివాసంలో మాజీ ఎమ్మెల్యేల సమావేశం

ఉండవల్లి నివాసంలో మాజీ ఎమ్మెల్యేల సమావేశం

సత్యసాయి: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సోమవారం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ను కలిశారు. రాజమండ్రి జైలులో ఎంపీ మిథున్ రెడ్డిని కలిసిన అనంతరం, వారంతా ఉండవల్లి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమమాచారం.