జిల్లా స్థాయి ఫెన్సింగ్ ఎంపిక పోటీలు ప్రారంభం

KRNL: జిల్లా స్థాయి ఫెన్సింగ్ ఎంపిక పోటీలను మంగళవారం కర్నూలులోని అవుట్ డోర్ స్టేడియంలో మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి డాక్టర్ శంకర్ శర్మ హాజరై మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రపంచ దేశాలలో ఫెన్సింగ్ క్రీడకు మంచి ఆదరణ లభిస్తోందని అన్నారు. స్పోర్ట్స్ కోటా ఫెన్సింగ్ క్రీడాకారులకు ఉద్యోగాలు లభించినట్లు తెలిపారు.