సోమశిల బ్యాక్ వాటర్‌లో చేప పిల్లలు విడుదల
అన్నమయ్య: నందలూరు(మం) రాజంపేట నియోజకవర్గంలో మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పథకం ప్రవేశపెట్టింది. ఇది ఎంతో ఉపయోగపడుతుందని పార్లమెంట్ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గారు తెలియజేశారు. ఈ మేరకు సోమశిల బ్యాక్ వాటర్ నందు చేప పిల్లలను వదిలారు.