విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో వ్యాపించిన మంటలు

విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో వ్యాపించిన మంటలు

GNTR: తాడేపల్లిలోని ఉండవల్లి సెంటర్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున విద్యుత్ స్తంభానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. గాలి దుమారానికి విద్యుత్ తీగలు తగిలి మెరుపులు వచ్చి కేబుల్ వైర్లపై పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇది గమనించిన స్థానికులు మంటలను అదుపులోకి తెచ్చారు.