విద్యుత్ షాక్‌తో రైతు మృతి
NRPT: దామరగిద్ధ మండలం బాపన్ పల్లి గ్రామానికి చెందిన బుడ్డపొల్ల నారాయణ బుధవారం విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. పొలం వద్ద విద్యుత్ తీగలు సరిచేస్తుండగా షాక్ తగిలి మృతి చెందినట్లు తెలిపారు. అచేతనంగా పడి ఉన్న నారాయణను గమనించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.