VIDEO: ఘనంగా శివపార్వతుల కళ్యాణం
ASR: అరకులోయలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో ఇవాళ శివపార్వతుల వార్షిక కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఏకాదశి పురష్కరించుకుని శివపార్వతుల కళ్యాణం జరిపినట్లు ఆలయ పూజారి వెంకన్నబాబు తెలిపారు. అనంతరం మధ్యహ్నం కార్తీక అన్నసమారాధన ఏర్పాటు చేశారు. అరకులోయ చుట్టుప్రక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అన్నప్రసాదాలను స్వీకరించారు.