మునిగిపోయిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం

మునిగిపోయిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం

తూ.గో: దేవీపట్నం మండలంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మతల్లి ఆలయం గోదావరి వరద నీటిలో మునిగిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు గోదావరి నీటిమట్టం పెరగడం వల్ల అమ్మవారి ఆలయం మునిగిపోయినట్లు దేవస్థాన అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా అమ్మవారి దర్శనాలు నిలిపివేసినట్లు తెలిపారు.