VIDEO: రామాలయంలో హుండీ అపహరణ

ELR: జంగారెడ్డిగూడెం స్థానిక బుట్టాయగూడెం రోడ్డులో ఉన్న రామాలయంలోకి గుర్తు తెలియని ఆగంతకులు చొరబడ్డారు. మంగళవారం ఉదయం ఆలయానికి చేరుకున్న అర్చకులు తలుపులు తెరచి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. హుండీ అపహరణకు గురైనట్లు గుర్తించి వెతకగా పక్కనే ఉన్న స్కూళ్లో లభించింది. ఈ ఘటన పై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.