VIDEO: అసత్య ప్రచారాలను తిప్పికొట్టిన జనసేన
ASR: వంపూరి గంగులయ్యపై వస్తున్న ఆరోపణలను జనసేన ఖండించింది. పాడేరు, చింతపల్లిలో కార్యకర్తలకు పదవులు ఇవ్వడం వాస్తవమేనని అయితే, దీనిపై అసత్య ప్రచారాలు తగదని హితవు పలికింది. అనవసర కలతలు నివారించేందుకు వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని ఏఎంసీ డైరెక్టర్ పాంగి శివాజీ శనివారం సూచించారు. సమస్యల పరిష్కారానికి పార్టీ నిష్పక్షపాతంగా కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.