నేడు మధ్యాహ్నం వరకు పవర్ కట్

SDPT: కొండపాకలో తీగల కింద చెట్ల కొమ్మల తొలగింపులో భాగంగా పలు గ్రామాల్లో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ సత్యం తెలిపారు. 33 కేవీ బందారం ఫీడర్, 132/133 కేవీ దుద్దెడ సబ్ స్టేషన్ పరిధిలోని బందారం, అంకి రెడ్డిపల్లి, కొండపాక, జప్తినాచారం, దమ్మక్కపల్లి, గ్రామాలకు సరఫరా నిలిచిపోతుందన్నారు.