ఎంపీ కావ్యను కలిసిన బార్ అసోసియేషన్ సభ్యులు

ఎంపీ కావ్యను కలిసిన బార్ అసోసియేషన్ సభ్యులు

హనుమకొండలోని కనకదుర్గ కాలనీలో ఎంపీ డాక్టర్ కడియం కావ్యను బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు చకిలం ఉపేందర్ మర్యాద పూర్వకంగా కలిశారు. బార్ అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువెళ్లగా, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఎంపీ హామీ ఇచ్చారు. న్యాయవాదుల సంక్షేమం, కోర్టుల మౌలిక వసతుల పెంపు కోసం తన వంతు కృషి కొనసాగుతుందన్నారు.