'ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవాలి'
KMR: రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ. 5 లక్షలు అందిస్తుందని, లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకోవాలని నడిమి తండా గ్రామ పంచాయతీ కార్యదర్శి సుష్మ సూచించారు. గ్రామానికి చెందిన లబ్ధిదారుడికి ఆదివారం ఇంటి నిర్మాణానికి మార్కింగ్ చేసి ముగ్గు పోసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రాజు వున్నారు.