నేడు సింగూరుకు మంత్రి రాక

నేడు సింగూరుకు మంత్రి రాక

SRD: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సోమవారం సింగూరు ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు సింగూరు ఎడమ కాలువ సిమెంటు లైనింగ్ పనులు, ఆనకట్ట రివిట్ మెంట్ పునరుద్ధరణ పనులను మంత్రి పరిశీలిస్తారని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లన్నగారి దుర్గారెడ్డి తెలిపారు. ఈ పర్యటనలో నేతలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు.