పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీరు

CTR: పుంగనూరు నియోజక వర్గం చౌడేపల్లి మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వేరుశనగ పంటకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం రైతులు మాట్లాడుతూ.. పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలతొ తాము నష్టపోతున్నామని తెలిపారు. సంబంధిత అధికారులు తమని ఆదుకోవాలని రైతులు కోరారు.