'ధాన్యం క్వింటాకు రూ. 3వేలు చెల్లించాలి'

W.G: భీమవరం దుర్గాపురంలో సీపీఎం జిల్లా కమిటీ సమావేశం ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చింతకాయల బాబురావు అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బలరాం మాట్లాడుతూ.. ధాన్యం క్వింటాకు రూ.3వేలు చెల్లించాలన్నారు. జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ మాట్లాడుతూ.. ప్రతి దళిత పేటకు రెండు ఎకరాల శ్మశాన వాటికను కేటాయించాలన్నారు.