అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
జగిత్యాల పట్టణంలోని 21వ వార్డులో రూ. 15 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇవాళ భూమిపూజ చేశారు. అలాగే, 4వ వార్డులో చెరువు కట్ట పోచమ్మ ఆలయం వద్ద రూ. 4 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కమిషనర్, తదితరులు పాల్గొన్నారు.