హాస్టల్ సిబ్బందిని అభినందించిన ఎస్సీ కమిషన్ ఛైర్మన్

హాస్టల్ సిబ్బందిని అభినందించిన ఎస్సీ కమిషన్ ఛైర్మన్

VZM: రామభద్రపురం ప్రీ మెట్రిక్ బాలుర హాస్టల్‌ను రాష్ట్ర SC కమిషన్ ఛైర్మన్ జవహర్ ఇవాళ తనిఖీ చేశారు. హాస్టల్‌లోని వసతి సౌకర్యాలు, భోజన నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించిన ఆయన, విద్యార్థులతో సమావేశమై వారి సమస్యలు, అవసరాలు తెలుసుకున్నారు. హాస్టల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్‌ను పరిశీలించి కూరగాయల సాగు పద్ధతులపై సంతృప్తి వ్యక్తం చేశారు.