'ఫిర్యాదులపై వెంటనే స్పందించి, బాధితులకు న్యాయం చేయాలి'

KDP: ఫిర్యాదులపై వెంటనే స్పందించి, బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కడపలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో స్వయంగా ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్ణీత సమయంలో పరిష్కరించాలన్నారు.