పైడిమడుగు PACS విజయంపై కలెక్టర్ అభినందనలు
JGL: కోరుట్ల మండలం పైడిమడుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) జాతీయ స్థాయిలో 3 స్థానం సాధించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సోమవారం కలెక్టరేట్‌లో సంఘ ప్రతినిధులను అభినందించారు. రైతులకు మరింత విస్తృత సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి మనోజ్ కుమార్,అసిస్టెంట్ రిజిస్ట్రార్ అసద్,కార్యదర్శి రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.