కనకమహాలక్ష్మి అమ్మవారికి శ్రావణ లక్ష్మి పూజలు

కనకమహాలక్ష్మి అమ్మవారికి  శ్రావణ లక్ష్మి పూజలు

VSP: విశాఖలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రావణ లక్ష్మీ పూజలు గురువారం వైభవంగా జరిగాయి. ఈ పూజలలో 80 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. శ్రావణ మాసంలో లక్ష్మీవారంగా భావించే గురువారం రోజున అధిక సంఖ్యలో మహిళా భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.