VIDEO: కొండగట్టు గుట్టపైకి ఆర్టీసీ ఉచిత బస్సులు
JGL: చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టుకు తరలివచ్చే దీక్షా స్వాములు, భక్తులకు అధికారులు ఆర్టీసీ ద్వారా ఉచిత ప్రయాణం అందిస్తున్నారు. కొండపైనగల బొజ్జ పోతన్న ఆలయ సమీపంలోని పార్కింగ్ ప్రదేశం నుంచి వై జంక్షన్ వరకు దాదాపు 2 కిలోమీటర్ల మేర నాలుగు ఆర్టీసీ బస్సులు సేవలందిస్తున్నాయి. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.