ఫోక్సో కేసు.. 3ఏళ్ల కఠిన కారాగార శిక్ష

ఫోక్సో కేసు.. 3ఏళ్ల కఠిన కారాగార శిక్ష

NTR: మైనర్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన డేవిడ్ పవన్ కుమార్(37) అనే వ్యక్తిపై కృష్ణలంక పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును విజయవాడ ఫోక్సో కోర్ట్ జడ్జి వి.భవాని గురువారం విచారించారు. డేవిడ్ పవన్ కుమార్ నేరం చేసినట్లు రుజువైనందున నిందితుడికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.20వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు.